దాచేపల్లి లోని అద్దంకి మరియు నార్కెట్ పల్లి రహదారి ఫ్లై ఓవర్ పై ఉదయం 5:30 గంటల సమయంలో 150 కి పైగా గొర్రెలు చనిపోయాయి. హైదరాబాదు నుండి బాపట్ల జిల్లా ఇంకొల్లు కు వెళ్తున్న శ్రీ మారుతీ ట్రావెల్స్ బస్సు రోడ్డు మీద వెళ్తున్నటువంటి గొర్రెలు మరియు మేకల మంద పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 150 జీవాలు మృతి చెందగా ఇద్దరు గొర్రెల కాపర్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలు పాలైన మల్లేష్ మరియు కర్రెప్పను స్థానికులు వెంటనే గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మోహన్‌బాబుకు చుక్కెదురు… బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
మరోవైపు ఈ ఘటనపై యాదవ సంఘాలు మరియు చుట్టుపక్కల గ్రామాల్లోని జీవాల పెంపకదారులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా ఆందోళనలు చేపట్టారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలని రహదారిపై ధర్నాలకు దిగారు. ఇక వెంటనే సమాచారం అందుకున్న సిఐ భాస్కరరావు ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ ఘటనలో చనిపోయిన జీవాల నష్టం సుమారుగా 20 నుండి 25 లక్షలు వరకు ఉంటుందని వారితో పాటుగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని కాబట్టి వెంటనే పరిష్కారం చూడాలని సిఐ ని కోరారు.
అల్లు అర్జున్ మామకు గాంధీభవన్ లో అవమానం!
ఇక ఆ తరువాత టిటిడి పాలకమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తికి ఈ విషయం తెలియడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సు యాజమాన్యం పిలిపించి నష్టపోయిన వారందరికీ న్యాయం చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా కూడా అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో వారందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇక వెంటనే చనిపోయినటువంటి పశువులను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక మార్కెట్ యార్డుకు తీసుకెళ్లారు.