
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గాను నీటి ప్రాజెక్టు లే కాకుండా రోడ్లపై కూడా నీరు నిలిచిపోయింది. ఈ భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వరదలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు దాదాపు 20 రోజుల నుంచి కురుస్తూనే ఉన్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా బస్టాండ్స్ అలాగే రైల్వే స్టేషన్స్ కూడా నీట మునిగిన సందర్భాలు చూసాం. అయితే తాజాగా కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా నేషనల్ హైవే -44 పై భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది.
Read also : జపాన్ కు చేరిన ప్రధాని మోడీ, టోక్యోలో ఘన స్వాగతం
కామారెడ్డి జిల్లా లో భారీ వరదలకు హైవే ఒకవైపు రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోయిన విజువల్స్ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఒకవైపు రోడ్డు మొత్తం కొట్టుకుపోవడంతో.. చేసేదేం లేక మిగిలిన వాహనాలన్నిటిని కూడా ఆ మిగిలిన ఒకవైపు లైన్లోనే పంపిస్తున్నారు. కొంచెంసేపు హైదరాబాదు వైపు మరి కొంచెం సేపు నిజామాబాద్ వైపు వాహనాలను అనుమతిస్తూ ట్రాఫిక్ జామ్ఏర్పడకుండా తగు జాగ్రత్తలను ఏర్పాటు చేస్తున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే ఈ హైవేపై సాధారణంగా వాహనాలు రద్దు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాంటి రోడ్డు ఇప్పుడు ధ్వంసం కావడంతో ఏకంగా 15 కిలోమీటర్ల మేర వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్ జామ్ పూర్తిగా క్లియర్ అవ్వాలంటే దాదాపు చాలానే సమయం పడుతుంది అని అధికారులు చెప్తున్నారు.
Read also : <a style="color:red" href=”https://crimemirror.com/youth-goes-missing-in-paleru-stream-near-gondriyala/”>గొండ్రియాల సమీప పాలేరు వాగులో యువకుడు గల్లంతు!