క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిది: ఐద్వా 14 వ జాతీయ మహాసభకు ఊరుకో బండి ఇంటికో మహిళ మేధావులు తరలి వచ్చి ఈ నెల 25న హైదరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి పాదూరు గోవర్ధన రెడ్డి అన్నారు.
నల్గొండ జిల్లా, వేములపల్లి మండల కేంద్రంలో ఐద్వా 14 వ జాతీయ మహాసభల సందర్భంగా జాతీయ మహాసభల పోస్టర్లను ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి పాదూరు గోవర్ధన సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పాదురు గోవర్ధన మాట్లాడుతూ… మహిళలకు పని ప్రదేశాలలో భద్రత కల్పించాలి. ఈ మహాసభకు ఊరుకో బండి ఇంటికో మహిళ మేధావులు తరలివచ్చి ఈనెల 25న జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని అన్నారు.
అసమానతలు లేని దేశం ఏర్పరచాలని మహిళలపై జరుగుతున్న వివక్షతలకు వ్యతిరేకంగా ఐద్వా అనేక పోరాటాలు చేస్తుందని మహిళలకు ఉపాధి అవకాశాలు తగ్గించి పని గంటలు పెంచేలా మోడీ ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లను తీసుకొస్తుందని వాటికి వ్యతిరేకంగా శ్రామికులు చేసే పోరాటాలకు అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురా రాళ్లు శీలం పద్మ, తంగెళ్ల నాగమణి, ఐద్వానాయకు రాళ్లు సింగం లక్ష్మి, జడ రామలింగమ్మ, గుండా బోయిన బోడమ్మ, ఎస్కే సైదాబీ, చామల జోగమ్మ, చింతిరెడ్డి పద్మ, చింతి రెడ్డి అలివేలు, చింతరెడ్డి జానకమ్మ, పాల్గొన్నారు.





