
Thailand-Cambodia War: ఆసియాలో మరో రెండు దేశాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. థాయ్ లాండ్, కాంబోడియా మధ్య పరస్పర దాడుల కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో డ్రోన్లు, రాకెట్ లాంచర్లతో యుద్ధానికి దిగాయి. ఈ దాడుల్లో 12 మంది థాయ్ పౌరులు చనిపోయారు. మరో 28 మంది గాయపడ్డారు. కాంబోడియాలో జరిగిన నష్టానికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. రెండు దేశాలు.. ట్యాంకులు, రాకెట్లతో దాడులకు పాల్పడ్డాయి. థాయ్ లాండ్ ఏకంగ F-16 ఫైటర్ జెట్లతో కాంబోడియాపై వైమానికి దాడులు చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లో సుమారు 10 చోట్ల దాడులు జరుగుతున్నాయి. థాయ్ సర్కారు సరిహద్దు ప్రాంతాలన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది.
థాయ్, కాంబోడియా మధ్య గొడవ ఏంటి?
జూలై 23న థాయ్ లాండ్ సరిహద్దు లోపల క్లెమోర్ మైన్ పేలడంతో ఈ ఉద్రికత్తలు తలెత్తాయి. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘాతుకానికి కాంబోడియానే కారణం అని భావించిన థాయ్ లాండ్.. ఆ దేశంలోని తమ రాయబారిని వెనక్కి పిలిపించింది. అదే సమయంలో కాంబోడియా రాయబారిని బహిష్కరించింది. అన్ని సరిహద్దు గేట్లు మూసివేసింది. తమ పౌరులను కాంబోడియా నుంచి వెనక్కి రావాలని ఆదేశించింది. అటు కాంబోడియా కూడా థాయ్ చర్యలకు ధీటుగా స్పందించింది. తమ సిబ్బందితో పాటు పౌరులు వచ్చేయాలని సూచించింది.
మే నుంచి కొనసాగుతున్న కోల్డ్ వార్
వాస్తవానికి ఇరు దేశాల మధ్య వివాదం ఇప్పటికప్పుడు మొదలయ్యింది కాదు. మేలో థాయ్ లాండ్ దాడిలో ఓ కంబోడియన్ సైనికుడు చనిపోయాడు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య గొడవలు పెరిగాయి. తాజాగా ఘర్షణలు మరింత ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు నువ్వా నేనా అన్నట్లు దాడులకు దిగుతున్నాయి. ప్రశాంత థాయ్ ఇప్పుడు బాంబుల మోతలతో దద్దరిల్లుతోంది.
Read Also: ఇండియన్స్ ను ఉద్యోగాల్లోకి తీసుకోకండి, టెక్ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్!