
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పరీక్షలు రాయడానికి పరీక్ష కేంద్రాలకు తరలివచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులందరూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గా 2,650 పరీక్ష కేంద్రాల్లో 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లుగా విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి వెళ్ళగానే విద్యార్థులను తనిఖీలు చేసిన తరువాతే ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తున్నారు. కాగా ఈసారి 24 పేజీల బుక్లెట్ విధానం అందుబాటులోకి రావడం జరిగింది. దీని ప్రకారమే పరీక్షలను బుక్లైట్లో రాయనున్నారు. కాగా ఇవాల్టి నుంచి మొదలుకొని ఏప్రిల్ నాలుగవ తారీఖున పదవ తరగతి పరీక్షలు ముగియనున్నాయి.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలనేవి ముగియనున్నాయి. ఈసారి చాలామంది ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు డుమ్మా కొట్టారని వార్తలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలను పరీక్ష కేంద్రాలకు పంపించాలని అధికారులు కోరుతున్నారు.
సై అంటే సై అంటున్న రసమయి, కవ్వంపల్లి – లడాయి ఎందుకో తెలుసా..?