
పెబ్బేరు, క్రైమ్ మిర్రర్ :- శ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ముగ్గురు స్వాములు అయ్యప్ప స్వామి దర్శనానికి పెబ్బేరు నుంచి శబరిమలై వరకు మహా పాదయాత్రగా బయలుదేరారు. పెబ్బేరు నుంచి శబరిమలై కి 1000.కిలోమీటర్ల పాటు ఇరుముడితో గోనెల అరవిందు, కార్తిక్,నాగరాజు అనే ముగ్గురు స్వాములు బుధవారం శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడి కట్టుకొని బయలుదేరారు. ఈ స్వాములు ప్రతిరోజూ కూడా 40 నుంచి 50 కిలోమీటర్లు నడుస్తూ 30 రోజుల్లో శబరిమలై చేరుకొనున్నారు. పంబలో స్నానం ఆచరించి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడి నుండి శబరిమళ పాదయాత్ర చేయాలంటే మాములు విషయం కాదు. ఎంతో దైవ భక్తి ఉంటే కానీ ఇలా చేయడం అసాధ్యామనే చెప్పాలి. దీంతో తోటి స్థానికులు ఈ అయ్యప్ప స్వాములపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read also : ఈతవనం ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై
Read also : శాంతించిన మొంథా తుఫాను.. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం : మంత్రి అచ్చెన్నాయుడు





