
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక తప్పని పరిస్థితులలో అప్పు చేయాల్సి ఉంటుంది. అపర కుబేరులు అయినటువంటి అంబానీ, అదాని లాంటి వారికి ఎన్నో అప్పులు ఉన్నాయి. ఎన్నో అప్పులు చేసి ప్రశాంతంగా ఉన్న వాళ్లయితే ఈ భూమి మీద లేరని చెప్పాలి. కొంతమంది అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి చేసేదేం లేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా నిత్యం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం జీవితంలో ఒక ఉద్యోగం ఉన్నా కూడా ఏదో ఒక పరిస్థితులలో అప్పు చేయాల్సి వస్తుంది. అయితే తాజాగా ఒక వ్యక్తి 10 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఇక చేసేదేమీ లేక ప్రతినెలా కూడా తన జీవితంలో నుంచి కట్ చేస్తూ EMI రూపంలో కడుతూనే ఉన్నాడు. అయినా కానీ మళ్ళీ ఏదో రూపంలో డబ్బు అవసరం అవడంతో చేసేదేమీ లేక కుంగిపోతూ ఉన్న సమయంలో… సరదాగా ఏఐ కాన్సెప్ట్ గుర్తుకు వచ్చి నా సమస్యను ఈ AI తీరుస్తుందో లేదో అని ప్రశ్నించుకున్నాడు.
Read also : బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. పోర్న్ సైట్లలో చిరంజీవి డీప్ ఫేక్ వీడియో!
అనుకున్నట్టుగానే ఏఐ చాట్ GPT కి తన అప్పుల గురించి వివరించాడు. తను నువ్వు అప్పుల నుంచి బయట పడేసి మార్గం ఏదైనా ఉంటే చెప్పమని కోరాడు. దీంతో చాట్ జిపిటి తనని అన్ని వివరాలు క్లుప్తంగా చెప్పమంది. ఇక తను కూడా తనకు వచ్చేటువంటి సంపాదన, ఖర్చులు, ఇంటి అద్దెలు అలాగే EMi లాంటివి అన్నీ కూడా చెప్పుకొచ్చాడు. అయితే వీటిని గుర్తించిన చాట్ జిపిటి వ్యక్తి ఖర్చు పెట్టే వృధా ఖర్చులను పసిగట్టింది. ఆ వృధా ఖర్చులను పసిగట్టడమే కాకుండా వాటిని ఎలా పొదుపు చేసి కేవలం రెండు సంవత్సరాలలోనే అప్పులు తీర్చవచ్చు అంటూ చెప్పుకొచ్చింది. అయితే చాట్ జిపిటి చెప్పిన ప్రకారమే రెండు ఏళ్ల కాలం లోనే అతను 10 లక్షల తీర్చినట్లుగా చెప్పాడు. దీంతో ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను అని… అప్పు లేకపోవడమే కాకుండా బాగా సంపాదిస్తున్నాను అని అతను చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్పులు చేసిన సమయంలో భయపడకుండా అప్పులు తీర్చే మార్గాన్ని తెలుసుకోవాలని కోరారు.
Read also : తెలంగాణలో బాధాకర ఘటన… చెల్లిని అమ్మొద్దు అంటూ తల్లిదండ్రులను వేడుకున్న కూతుర్లు!





