Wednesday, March 4, 2026
Homeజాతీయంత్వరలోనే మౌని అమావాస్య!... మహా కుంభమేళకు భారీగా రానున్న జనాలు?

త్వరలోనే మౌని అమావాస్య!… మహా కుంభమేళకు భారీగా రానున్న జనాలు?

భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి మహా కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుండి భారీగా ప్రజలు చేరుకుంటున్నారు. దాదాపుగా 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మహా కుంభమేళాకు కొన్ని కోట్ల మంది క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహా కుంభమేళాలో ఎటువంటి అనర్ధాలు లేదా ఇబ్బందులు కలక్కుండా అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి కూడా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ మహాకుంభమేళాకు దాదాపుగా భారీ మొత్తంలో కొన్ని కోట్లను ఖర్చు పెట్టారు.

రైతు భరోసా, రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కీలక సమావేశం

ఇక త్వరలోనే ఈనెల 29వ తారీఖున మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు ఏకంగా 10 కోట్ల మంది భక్తులు అమృత స్నానాలు చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకోసం భారీగానే యూపీ ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తుంది. 12 కిలోమీటర్ల మేర పొడవైన ప్రత్యేక ఘాట్ రోడ్డు నది మీద సిద్ధం చేసింది. అయితే ఈ మౌని అమావాస్య రోజున విఐపి జోన్ ఉండదని కాబట్టి ఈ ప్రముఖులకు అదనపు ఏర్పాట్లు కూడా ఉండవని రాష్ట్ర ప్రభుత్వం కరా కాండిగా తెలిపింది. ఇక ఈ మౌని అమావాస్య తో పాటుగా ఫిబ్రవరి మూడో తారీఖున వసంత పంచమి, 12వ తారీఖున మాగ పూర్ణిమ, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి తేదీల్లోనూ పెద్ద ఎత్తున భక్తులు అమృత స్నానాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

కేసీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments