Tuesday, March 17, 2026
Homeతెలంగాణ10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.! గులాబీ పార్టీకి షాక్

10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.! గులాబీ పార్టీకి షాక్

  • అనర్హత వేటు భయం తొలగడంతో పావులు 

  • తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఆపరేషన్ బీఆర్ఎస్-2 మొదలైందా? గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయా? ఎమ్మెల్యేలపై అనర్హత కొలిక్కి రావడంతో కొత్త ప్రయత్నం మొదలైందా? గులాబీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా సీఎం రేవంత్ పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కాంగ్రెస్లో జంప్ చేసిన పదిమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అయితే ఇప్పుడు అదే అదునుగా మరో 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అనర్హత వేటు భయం ఒకవైపు పోయింది. ఇంకోవైపు బీఆర్ఎస్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. అందుకే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కదలిక మొదలయిందని.. కాంగ్రెస్ పార్టీ నుంచి పావులు కదపడం ప్రారంభం కావడంతో బిఆర్ఎస్ నుంచి చేరికలు ప్రారంభం అవుతాయి అన్న విశ్లేషణలు వస్తున్నాయి.

  •  రేవంత్ గట్టి ప్రయత్నం 

మొన్నటి ఎన్నికల్లో గులాబీ పార్టీ 36 స్థానాల్లో విజయం సాధించింది. ఓ పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వచ్చేసారు. ఉన్నది ఇంకా 26 మంది మాత్రమే. మరో పదిమందిని లాగేస్తే గులాబీ పార్టీకి ప్రతిపక్ష హోదా పోతుందన్నది రేవంత్ పంతంగా తెలుస్తోంది. ఆపరేషన్ బీఆర్ఎస్ ప్రారంభించినప్పుడే ఆ పార్టీని ఖతం చేయాలని రేవంత్ గట్టి ప్రయత్నాలు చేశారు. చాలామంది ఎమ్మెల్యేలను ఆకర్షించారు. కానీ గులాబీ పార్టీ పెద్దలు అప్రమత్తమయ్యారు. ఒకవైపు డ్యామేజ్ కంట్రోల్ చేస్తూనే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారించిన స్పీకర్ ఒక వ్యూహం ప్రకారం వారిపై అనర్హత వేటు పిటిషన్లను కొట్టివేశారు. అయితే ఇప్పుడు అనర్హత వేటు భయం పోవడంతో గులాబీ పార్టీ నుంచి మరో పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

  •  కాంగ్రెస్కు పెరిగిన బలం

వాస్తవానికి మొన్నటి మున్సిపల్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందన్న ప్రచారం నడిచింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అన్నిచోట్ల సత్తా చాటింది. కాంగ్రెస్ పట్ల తెలంగాణ ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు స్పష్టమైంది. అందుకే ఇప్పుడు గులాబీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక రకమైన కలవరం ప్రారంభమైంది. అందుకే వారంతా పార్టీని వీడడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పావులు కదిపితే.. వచ్చే ఎన్నికల్లో టికెట్లకు భరోసా ఇస్తే మాత్రం ఎమ్మెల్యేలు హస్తం గూటికి రావడం ఖాయమని తేలుతోంది.

  • బీఆర్ఎస్ కష్టం 

పైగా గులాబీ పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు. కెసిఆర్ ఫాంహౌస్ దాటి రావడం లేదు.. కేటీఆర్ సైతం ట్విట్లతో సరిపెడుతున్నారు. కనీసం కవిత దూకుడు ముందు కూడా నిలబడలేక పోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆ పార్టీ మరింత బలహీన పడటం ఖాయం. అయితే ఈ పరిస్థితిని గమనిస్తున్న గులాబీ పార్టీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఓ పదిమంది వరకు ఎమ్మెల్యేలు జంప్ చేస్తే బిఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా మిస్ అయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి కూడా కావాల్సింది అదే. అందుకే శరవేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. మొత్తానికైతే తెలంగాణ రాజకీయాల్లో మరోసారి జంపింగ్ మొదలుకానున్నయన్న మాట.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments