దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ఆంక్షలు కొనసాగనున్నాయి. హైదరాబాద్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో టపాసులు కాల్చేందుకు రెండుగంటలు మాత్రమే టైం ఇచ్చారు. రద్దీ ప్రాంతాలు, రోడ్లపై క్రాకర్స్ కాల్చడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కమిషనరేట్ పరిధిలో రాత్రి 8 గంటల నుంచి10 గంటల వరకు మాత్రమే క్రాకర్స్ కాల్చాలని స్పష్టం చేశారు. నవంబర్ రెండు వరకు ఉత్తర్వులు అమలులో ఉంటాయని సీపీ తెలిపారు.
దీపావళి పండుగను అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు కోరారు. పోలీస్ రూల్స్‌ను అందరూ పాటించాలని కోరారు. అతిక్రమించి వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అగ్నిప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్రత్తులు తీసుకొని దీపావళి పండుగను జరుపుకోవాలని పిలుపు నిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. గల్లీల్లో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలతో ప్రజలు అప్రమత్తంగా వుండాలన్నారు. ప్రమాదాలు నివారణ అందరి సామాజిక బాధ్యతగా వ్యవహరించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.