తెలంగాణ

హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య!

హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. చెరువులు, ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకున్నవారు భయంతో వణికిపోతున్నారు. కొందరు పట్టా భూముల్లో నిర్మాణాలు చేపట్టగా.. మరికొందరు ఎల్ఆర్ఎస్ తో కట్టారు. తమ వద్ద అన్ని ప్రభుత్వ డాక్యుమెంట్స్ ఉన్నా హైడ్రా అధికారులు నోటీసులు ఇస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో రెండు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

కూకట్ పల్లి రామాలయం సమీపంలోని యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే 56 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో కటికీ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హైడ్రా భయంతోనే ఆమె సూసైడ్ చేసుకుందని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. హైడ్రా ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న నల్లచెరువు పరిధిలో పలు ఇండ్లు, షెడ్లను అధికారులు గత శని, ఆదివారాలు కూల్చివేశారు. ఈ శనివారం కూడా హైడ్రా కూల్చివేతలు ఉంటాయనే చర్చ సాగుతోంది.

Read More : మంత్రి పొంగులేటి ఇంట్లో నోట్ల కట్టలు.. ఈడీ అధికారులు షాక్!

నల్లచెరువులో ఉన్న తన రెండు ఇల్లులు, షెడ్డును అధికారులు కూల్చివేస్తారనే భయంతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె బంధువులు చెబుతున్నారు. బుచ్చమ్మ ఆత్మహత్య కూకట్ పల్లిలో కలకలం రేపుతోంది. హైడ్రాకు వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దమవుతున్నారు.

Back to top button