Wednesday, March 4, 2026
Homeతెలంగాణహైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హై సెక్యూరిటీ

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హై సెక్యూరిటీ

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటివద్ద పోలీసులు భద్రత పెంచారు. మధురానగర్ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్‌ పోస్టును ఏర్పాటు చేశారు. నగరంలో చెరువులు, కుంటల్లో అక్రమ కట్టడాల తొలగింపును వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయనకు ఏమైనా ముప్పు ఏర్పడవచ్చనే అనుమానంతో ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది. ఇటీవల సినీనటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్- కన్వెన్షన్ కూల్చివేత తర్వాత బడా రాజకీయ నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం రంగనాథ్ ఇంటి వద్ద భద్రత పెంచినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments