తెలంగాణరంగారెడ్డిహైదరాబాద్

హైకోర్టుకు హైడ్రా కమిషనర్.. కూల్చివేతలకు బ్రేక్!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా.. వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ శని, ఆదివారాల్లో ఎక్కడా హైడ్రా బుల్డోజర్లు దిగలేదు. మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు మార్కింగ్ వేసినా .. రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలను టచ్ చేయలేకపోయింది హైడ్రా. ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వచ్చిన వ్యతిరేకత వల్లే కూల్చివేతలపై హైడ్రా వెనక్కి తగ్గిందని తెలుస్తోంది. అటు అధికార పార్టీ నేతలు కూడా హైడ్రా పై సీరియస్ అవుతున్నారు. బస్తీల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో హైడ్రాకు ఎంట్రీ లేదని తూర్పు జగ్గారెడ్డి అల్టిమేటం ఇచ్చేశారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైకోర్టుకు హాజరుకానున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌ పూర్‌లో హైడ్రా కూల్చివేతలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథన్‌, అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ హాజరుకానున్నారు. కాగా కిష్టారెడ్డి పంచాయతీ పరిధిలోని శ్రీకృష్ణనగర్‌‌‌‌లో ఆస్పత్రి బిల్డింగ్ ను హైడ్రా ఇటీవల కూల్చివేసింది. దీనిపై ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తుండగా.. సర్వే నెంబర్164లోని ప్రభుత్వ స్థలంలో ఉన్న ఆస్పత్రి భవనాన్ని 48 గంటల్లో తొలగించాలంటూ ఈ నెల 20న యాజమాన్యానికి తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు.

హైడ్రా నోటీసులను సవాల్ చేస్తూ గణేశ్ కన్‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌, డాక్టర్‌‌‌‌ మహమ్మద్‌‌‌‌ రఫీ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. ఆసుపత్రి బిల్డింగ్‌ను ఈ నెల 22న బేసీబీ, బుల్డోజర్లు, 50 మంది సిబ్బందితో వచ్చి..ఆసుపత్రి భవనాన్ని కూల్చివేసింది హైడ్రా. కోర్టు పరిధిలోని పిటిషన్లపై విచారణ ముగిసేదాకా ఆ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోవద్దని, జీవో 99 రూల్స్ పాటించాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్, అమీన్ పూర్ తహసీల్దార్ ను ఆదేశించింది.

ఇవి కూడా చదవండి …

  1. హైడ్రా పేరుతో లక్ష కోట్ల స్కాం.. బండి సంజయ్ సంచలన ఆరోపణ
  2. చార్మీనార్‌ను కూల్చేస్తారా.. హైడ్రాపై హైకోర్టు సీరియస్
  3. రాజా సింగ్ హత్యకు పక్కా స్కెచ్? నిందితుల ఇళ్లలో తుపాకులు, కత్తులు!
  4. రాజా సింగ్ హత్యకు కుట్ర! గన్స్‌తో వచ్చిన ఇద్దరు అరెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button