Wednesday, March 4, 2026
Homeక్రైమ్హీరో రవితేజకు సీరియస్.. షూటింగ్ లో ప్రమాదం

హీరో రవితేజకు సీరియస్.. షూటింగ్ లో ప్రమాదం

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టాలీవుడ్ టాప్ హీరో రవితేజకు ఆర్టీ75 షూటింగ్ లో గాయపడ్డారనే ప్రచారం కలకలం రేపింది. రవితేజ కుడిచేతికి గాయమైందని.. గాయంతోనే ఆయ షూటింగ్ లో పాల్గొన్నారనే వార్తలు వచ్చాయి. కుడిచేతి గాయం ఎక్కువ కావడంతో యశోద ఆస్పత్రిలో రవితేజకు శస్త్రచికిత్స జరిగిందని కూడా ప్రచారం సాగింది. డాక్టర్ల సూచనతో రవితేజ ఆరు వారాలు రెస్ట్ తీసుకొంటున్నారని కథనాలు వచ్చాయి.

అయితే రవితేజ గాయంపై యశోద హాస్పిటల్ డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. హీరో రవితేజ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. కండరాల నొప్పితో యశోద లో చేరారని.. రెండు రోజులు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. రవితేజకు ఎలాంటి సర్జరీ జరగలేదని యశోద వైద్యులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments