ఆంధ్ర ప్రదేశ్

హీరో బాలకృష్ణకు వ్యతిరేకంగా మద్యం టెండర్ వేసిన వ్యక్తి కిడ్నాప్

అనంతపురం జిల్లాలో మద్యం షాపుల టెండర్లు రచ్చ రాజేస్తున్నాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే టెండర్ల దందా సాగినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలతో సంబంధం లేకుండా టెండర్లు వేసిన వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పుట్టపర్తిలో లిక్కర్ షాపు టెండర్ దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్ కావడం కలకం రేపుతోంది.

పుట్టపర్తిలో పరిధిలోని లేపాక్షిలో ఏర్పాటు చేయనున్న లిక్కర్ షాపును టెండర్ వేలంలో దక్కించుకున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. 10 లక్షల రూపాయల నగదు, నెలనెలా 15000 రూపాయలు చెల్లిస్తామంటూ కిడ్నాపైన వ్యక్తి భార్యకు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. మేం చెప్పినట్లు చేస్తే డబ్బులు ఇచ్చి వదిలేస్తామని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆగంతకులు ఫోన్ లో బెదిరించారు.

లేపాక్షి కి సంబంధించి 57వ నెంబర్ షాపును వేలంలో దక్కించుకున్నారు రంగనాథ్. అయితే వేలం దక్కిన కొంత సేపటికే రంగనాథ్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పుట్టపర్తి సాయి ఆరామం వద్ద బాధితుని బంధువులు ఆందోళన చేస్తున్న సమయంలో కిడ్నాపర్ల నుంచి రంగనాథ్ భార్యకు ఫోన్ వచ్చింది. నీ భర్తకు ఎటువంటి హాని తలపెట్టము, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు వ్యతిరేకంగా టెండర్ వేయడం వల్లే కిడ్నాప్ చేయాల్సి వచ్చిందని అగంతకులు చెప్పారు.

దుకాణం నిర్వహించుకునేందుకు మాకు వదిలేస్తే “”పది లక్షల రూపాయలు నగదు నెలనెలా పదివేలరూపాయలు”” చెల్లిస్తాము ఇందుకు మీకు సమ్మతమేనా అంటూ ఆగంతకులు రంగనాథ్ భార్యకి ఫోన్ లో వివరించారు. ఎందుకు మీకు సమ్మతమైతే డబ్బులు బెంగళూరులో అయినా సరే హిందూపురంలో అయినా సరే మీరు ఎవరికి చెబితే వారి చేతికి ఇస్తామని కిడ్నాపర్లు మాట్లాడారు. రంగనాథ్ తండ్రి మాట్లాడుతూ అదృష్టం కొద్దీ లాటరీలో మాకు షాపు దక్కిందని అంతమాత్రాన దౌర్జన్యం చేసి నా కొడుకును కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు పట్టించుకోవడంలేదని వాపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button