ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

హీరో నాగార్జున బిల్టింగ్ ఖతం.. నెక్స్ట్ కేటీఆర్ ఫాంహౌజ్ నేలమట్టం?

హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నంత పని చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అక్రమార్కులకు దడ పుట్టిస్తున్నారు. గత వారంలో రోజులుగా యాక్షన్ లోకి దిగిన హైడ్రా.. మణికొండ, గండిపేట, అమీన్ పూర్, బాచుపల్లిలో 60కి పైగా అక్రమ భవంతులను కూల్చేసింది. చెరువులకు సంబంధించిన FTL, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగిస్తోంది. పెద్ద పెద్ద భవంతులను సైతం బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. అక్రమ కట్టడాలు కట్టిన వాళ్లు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఏవీ రంగనాథ్.

చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు. మాదాపూర్ తమ్మిడి చెరువులో హీరో నాగార్జున నిర్మించిన ఎన్‌ కన్వెన్షన్‌ ను నేలమట్టం చేశారు హైడ్రా అధికారుల. తెల్లవారుజామునే బుల్జోజర్లతో ఎన్ కన్వెషన్ కు చేరుకున్న హైడ్రా అధికారులు.. హీరో నాగార్జునకు చెందిన భవనాన్ని పూర్తిగా కూల్చేశారు. అన్నిఆక్రమణలను తొలగించి 29 ఎకరాల 24 గుంటలకు పైగా ఉన్న తమ్మిడి చెరువును పునరుద్ధరించాలని హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగారు కమిషనర్ రంగనాథ్.

హీరో నాగార్జున అక్రమ కట్టడం నేలమట్టం కావడంతో నెక్స్ట్ హైడ్రా టార్గెట్ ఏంటన్న చర్చ సాగుతోంది. గండిపేట సమీపంలోని జన్వాడలో కేటీఆర్ నిర్మించారని చెబుతున్న ఫాంహౌజే నెక్స్ట్ హైడ్రా టార్గెట్ అనే ప్రచారం సాగుతోంది. జన్వాడ ఫాంహౌజ్ విషయంలో ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. అయితే రూల్స్ ప్రకారం హైడ్రా వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు కేటీఆర్ మాత్రం తన పేరు మీద ఎలాంటి ఫాంహౌజ్ లేదని చెప్పారు. తన ఫ్రెండ్ ఫాంహౌజ్ ను లీజుకు తీసుకున్నానని చెప్పారు. FTL, బఫర్ జోన్ లో ఫాంహౌజ్ ఉంటే తానే కూల్చివేయిస్తానని తెలిపారు. ఇప్పుడు హైడ్రా ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.

Back to top button