క్రైమ్

హీరోయిన్ కస్తూరీ జైలు నుంచి రిలీజ్

తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో జైలుకు వెళ్లిన హీరోయిన్ కస్తూరీ ఇవాళ విడుదల కానున్నారు. కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో తమిళనాడు పుళల్‌ జైలు నుంచి నటి కస్తూరి రిలీజ్‌ కానున్నారు. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఎగ్మూర్‌ కోర్టు ఆమెకు బెయిల్‌ ఇచ్చింది. తాను సింగిల్‌ మదర్‌ అని, తనకు స్పెషల్లీ ఏబుల్డ్ చైల్డ్ ఉందని బెయిల్ పిటిషన్‌లో తెలిపారు కస్తూరీ. ఆమెను తానే చూసుకోవాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. ఆమె బెయిల్ కు పోలీసుల తరఫున అభ్యంతరం తెలపకపోవడంతో ఆమె విజ్ఞ‌ప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి.. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు.

ఈ నెల 4న తమిళ బ్రహ్మణ సమ్మేళనం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన కస్తూరి.. తెలుగువారిపై వివాదాస్పద కామెంట్లు చేశారు. 300 ఏళ్ల కిందట రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వాళ్లని అన్నారు. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని కస్తూరి వ్యాఖ్యానించారు. తెలుగువారిని ఉద్దేశించి కస్తూరీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అఖిల భారత తెలుగు సమ్మేళనం ప్రతినిధులు ఎగ్మూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సమన్లు ఇవ్వడానికి కస్తూరి ఇంటికి పోలీసులు వెళ్లగా ఆమె లేకపోవడంతో పరారీలో ఉన్నట్లు ప్రకటించారు.

మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలపై కస్తూరి క్షమాపణలు చెప్పారు. తమిళనాడులో ద్రవిడ ఐడియాలజీ నడుస్తోందిని.. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవాళ్లే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీపై విమర్శలు చేసినందుకే తనపై ఇలాంటి అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని కస్తూరీ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button