తెలంగాణ

హిమాయత్ సాగర్‌ డ్యాంలో భారీ కొండ చిలువ కలకలం

హైదరాబాద్ శివారులోని హిమాయత్ సాగర్ జలాశయంలో భారీ కొండ చిలువ కలకలం రేగింది. జలాశయం క్రస్ట్ గేటు వద్ద ఇరుక్కుపోయింది కొండ చిలువ. కొన్ని గంటలపాటు నరక యాతన అనుభవించింది. కొండ చిలువను గుర్తించిన జల మండలి సిబ్బంది.. స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు.

క్రస్ట్ గేటు వద్ద ఇరుకున్న కొండ చిలువను కాపాడారు స్నేక్ సొసైటీ సభ్యులు. దైర్యంగా క్రస్ట్ గేటు వద్ద కు దిగి.. కొండ చిలువ నోటిని పట్టుకొని తాడు కట్టారు. పైన ఉన్న జలమండలి సిబ్బంది తాడును లాగడంతో పైకి వచ్చాడు స్నెక్ సొసైటీ సభ్యుడు. అనంతరం భారీ కొండ చిలువను జూ అధికారులకు అప్పగించారు. భారీ వర్షాలకు ఎగువ నుంచి హిమాయత్ సాగర్ జలాశయానికి కొట్టుకు వచ్చింది భారీ కొండ విలువ.కొండచిలువను ధైర్యంగా పట్టుకుని పైకి తీసుకువచ్చిన స్నేక్ సొసైటీ సభ్యులను జలమండలి ఉద్యోగులు, స్థానికులు అభినందించారు.

Back to top button