
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్ :- లిడ్ క్యాప్ భూముల పరిరక్షణ కోసం రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ లను కలిసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. లీడ్ క్యాప్ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం కోసం తీసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని అలాగే ఇప్పటికే ఇచ్చిన లీజును కూడా రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లిడ్ క్యాప్ భూములను పరిరక్షించాలని కోరుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ,రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబుని మరియు రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కలవడం జరిగిందని ఎంఎస్పీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్రస్వామి మాదిగ పత్రికల వారితో మాట్లాడుతూ తెలిపారు.
Read also ::మహాలక్ష్మి పథకం ద్వారానే ఆర్టీసీకి మంచి డిమాండ్ వచ్చింది : బీర్ల ఐలయ్య
Read also : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు 104 ఉద్యోగుల వినతి





