జాతీయంతెలంగాణ

హర్యానాలో బీజేపీని గెలిపించిన రేవంత్ రెడ్డి బుల్జోజర్!

పక్కాగా గెలుస్తామనుకున్న హర్యానాలో ఎందుకు ఓడిపోయాం.. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కు పెద్ద ప్రశ్న. హర్యానా ఫలితాలతో షాకైన కాంగ్రెస్ పెద్దలు అసలేం జరిగిందనే విషయంలో పోస్ట్ మార్టమ్ నిర్వహిస్తున్నారు. అయితే హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి తెలంగాణ లింకు ఉందని కొందరు పార్చీ పెద్దలు చెప్పారట. తెలంగాణలో రేవంత్ రెడ్డి అసమర్థ పాలనే హర్యాణాలో ఆ పార్టీ కొంప ముంచిందని స్పష్టంగా చెప్పారట. తెలంగాణలో అమలు చేస్తున్న హైడ్రా బుల్డోజర్ రాజకీయమే హర్యానలో కాంగ్రెస్ ను బొంద పెట్టిందనే టాక్ జాతీయ స్థాయిలోనూ వినిపిస్తోంది.

హర్యానాలో గత పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలు.. వాటి పరిణామాలతో బీజేపీకి గట్టి దెబ్బ ఖాయమనుకున్నారు. జాట్ సామాజిక వర్గం కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ వైపు చూసింది. రెజ్లర్లు వినేష్ పొగట్, సాక్షి మాలిక్ ,బజరంగ్ పునియాలు కాంగ్రెస్ లో చేరడం హస్తం పార్టీకి మరింత బూస్ట్ ఇచ్చింది. అన్ని అంశాలు అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్ విజయం ఖాయమని అంతా భావించారు. ప్రీ పోల్ సర్వేలు అవే చెప్పాయి. పోలింగ్ తర్వాత నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలన్ని కాంగ్రెస్ దే హర్యానాలో అధికారమని స్పష్టం చేశాయి. అయితే ఫలితాల్లో మాత్రం అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది.

హర్యానాతో తమకు వ్యతిరేకత ఉందని గ్రహించిన బీజేపీ పెద్దలు పక్కా వ్యూహాలతో ప్రచారం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని సమస్యలనే కమలం నేతలు క్యాష్ చేసుకున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనపై వస్తున్న వ్యతిరేకత బీజేపీకి బాగా కలిసొచ్చింది.హైడ్రా బుల్డోజర్ కూల్చివేతలను తమ అస్త్రంగా వాడుకున్నారు బీజేపీ నేతలు. చెరువులు పరిరక్షణ అంటూ పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్లపై బుల్డోజర్లను దింపారని ప్రచారం చేశారు. తెలంగాణలోని హైడ్రా బాధితుల వీడయోలను హర్యానాలో వైరల్ చేశారు. ప్రజలు చెమటోడ్చి కట్టుకున్న ఇళ్లను కమీషన్ల కోసం నేలమట్టం చేశారని హర్యానా ప్రజలకు వివరించారు. ఇది తమకు బాగా కలిసివచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారు .

యూపీ, మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రులు సాగిస్తున్న బుల్డోజర్ పాలనను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ హర్యానాలో ప్రచారం చేశారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బుల్డోజర్ రాజకీయాలను నడిపించారు. ఈ అంశంతోనే రాహుల్ ను కార్నర్ చేశారు ప్రధాని మోడీ, అమిత్ షా. రైతుల రుణమాఫీ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును కూడా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ సభల్లో విమర్శించారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలు అని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటి అమలులో మాత్రం పూర్తిగా విఫలమైంది. ఇదే విషయంలో హర్యానా ప్రజలు ఆలోచనలో పడ్డారు.

Read More : రాహుల్‌ను ఏకిపారేస్తున్న మిత్రపక్షాలు.. కాంగ్రెస్ ఖేల్ ఖతమేనా?

రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలే బీజేపీ అస్త్రంగా పని చేశాయని..ఎన్నికలకు ముందు హర్యానాలో ఉన్న అనుకూల వాతావరణాన్ని తెలంగాణలో ఆ పార్టీ అసమర్థ పాలనే కొంపముంచిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రజా సంబంధాల పట్ల అవగాహన లేని రేవంత్ తీరు విజయాన్ని దూరం చేశాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో రేవంత్ దారితప్పి నడిపించిన బుల్డోజర్.. చివరకు హర్యానాలో హస్తం పార్టీని కూల్చిందనే మాటలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button