Monday, March 2, 2026
Homeతెలంగాణహరీష్ రావుపై కేసు.. ఏడేళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్!

హరీష్ రావుపై కేసు.. ఏడేళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మాజీ‌ మంత్రి హరీష్ రావు పై పోలీస్ కేసుకు రంగం సిద్దమైంది.యాదగిరిగుట్ట శ్రీలక్ష్మి నర్సింహాస్వామి వారి ఆలయంలో నిభందనలకు విరుద్ధంగా వ్యవహరించిన మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, గుర్తు తెలియని పూజారిపై పోలీసులకు పిర్యాదు చేశారు.

యాదగిరిగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేశారు ఆలయ ఈవో భాస్కర్ రావు. ఎండోమెంట్స్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం దేవాలయ ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలు నిషిద్ధమంటున్నారు దేవాలయ శాఖ అధికారులు. నేర నిరూపణ జరిగితే గరిష్టoగా ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం అంటున్నారు అధికారులు.

తమ రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన యాదగిరిగుట్టను అపవిత్రం చేశారని కాంగ్రెస్ నేతల ఆరోపించారు. హరీష్ రావు తిరిగిన ఆలయ మాఢవీదులను వాటర్ ట్యాంకర్ లతో నీటిని Disney ఆలయాన్ని శుద్ధి చేశారు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య.

RELATED ARTICLES

Most Popular

Recent Comments