జాతీయం

సేల్స్ మెన్ గా మారిన రాహుల్ గాంధీ

లోక్ సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సేల్స్ మెన్ గా మారారు. ఢిల్లీలోని ఓ కిరాణషాపులో కొన్ని గంటల పాటు పనిచేశారు..కస్టమర్లకు వస్తువులు అమ్మారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. కిరాణా షాపుల ఓనర్లు, కస్టమర్ల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వేగంగా వృద్ది చెందుతున్న క్విక్ కామర్స్ బిజినెస్ కారణంగా వేలాది కిరాణా షాపులు మూతపడుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం అని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో ఓ వీడియోను షేర్ చేశారు.

చిన్న చిన్న వ్యాపారాలు, వ్యాపారస్తులను రక్షణకు వ్యవస్థ అవసరాన్ని ట్వీట్ లో రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. కిరాణా దుకాణాలు కేవలం వస్తువులను విక్రయించే వ్యాపారమే కాదు.. కస్టమర్లతో భావోద్వేగ,సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉంటుందన్నారు. ‘‘క్విక్ కామర్స్ బిజినెస్ తో వేలాది చిన్న చిన్న కిరాణా దుకాణాలు మూతపడుతున్నాయి. ఈ రంగంలో గుత్తాధిపత్యం నడుస్తోందన్నారు రాహుల్ గాంధీ. ప్రపంచ ట్రెండ్, మారుతున్న ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా ముందుగు సాగుతున్నప్పుడు చిరు వ్యాపారులు నష్టపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని రాహుల్ గాంధీ తన ట్వీట్ లో చెప్పారు.

మరోవైపు దుకాణదారులు, కస్టమర్లు తమ కష్టాలను రాహుల్ తో పంచుకున్నారు. చిన్న వ్యాపారులు GSTపై అసంతృప్తి వ్యక్తం చేశారు.వ్యాట్ నుంచి నాలుగు రెట్ల పన్ను వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద క్విక్ కామర్స్ సంస్థలతో నష్టపోతున్నామని తెలిపారు. మరోవైపు కార్మికులు, గిగ్ వర్కర్లు, హౌస్ పెయింటర్లు, కుండల కళాకారులతో కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button