తెలంగాణ

సీఐ కుర్చీలో కూర్చుని కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి కొండా వార్నింగ్

హీరో నాగార్జున-సమంతపై వివాదాస్పద కామెంట్లు చేసి రచ్చ రాజేసిన మంత్రి కొండా సురేఖ మరోసారి హంగామా చేశారు. వరంగల్ లో సొంత పార్టీ ఎమ్మెల్యేకు ఆమె కౌంటరిచ్చారు. ఏకంగా పోలీస్ స్టేషన్ లో సీఐ కుర్చిలో కూర్చుని సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటన వరంగల్ కాంగ్రెస్ తో పాటు గాంధీభవన్ లో కలకలం రేపుతోంది.

వరంగల్‌ మరోసారిమంత్రి కొండా సురేఖ , పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌ రెడ్డి మధ్య గొడవ జరిగింది. దసరా ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌ రెడ్డి ఫొటో లేకపోవడంతో వివాదం మొదలైంది. ఈ విషయంలో ఎమ్మెల్యే రేవూరి, మంత్రి కొండా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. కొండా సురేఖ వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో ధర్మారం రైల్వేగేట్ దగ్గర మంత్రి కొండా సురేఖ వర్గీయులు ధర్నాచేశారు.

తన వర్గీయులను అరెస్ట్ చేయడంతో స్వయంగా రంగంలోకి దిగారు మంత్రి కొండా సురేఖ. గీసుగొండ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. మంత్రి కొండ రాకతో గీసుగొండ పోలీస్ స్టేషన్లో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. సీఐ కుర్చీలో కూర్చున్నారు మంత్రి కొండా సురేఖ. తన మనుషులను ఎందుకు అరెస్ట్ చేశారని సీఐకి క్లాస్ పీకారు. ఎమ్మెల్యే చెబితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేతో పాటు మీ అందరి సంగతి చూస్తానంటూ రెచ్చిపోయారు మంత్రి కొండా సురేఖ. మంత్రి వచ్చారన్న సమాచారంతో కొండా వర్గీయులు భారీగా గీసుగొండ పోలీస్ స్టేషన్ కు వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button