తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కుమారి ఆంటీ.. ఎందుకో తెలుసా..?

సైబరాబాద్ దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి దగ్గర ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారి ఆంటీ మరోసారి వార్తల్లోకి వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిని కలిశారు. తన పిల్లలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాసాకి వెళ్లారు కుమారీ ఆంటీ. సీఎం రేవంత్ రెడ్డి కుమారీ ఆంటీ కలిసి వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మీది మొత్తం వెయ్యి రూపాయలు.. రెండు లివర్‌లు ఎక్స్‌ట్రా అనే వీడియోతో కుమారి ఆంటీ పాపులర్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్, యూట్యూబ్‌ ఇంటర్వ్యూలతో కుమారి పేరు మార్మోగిపోయింది. కుమారి ఆంటీ వద్ద ఫుడ్ బాగుంటదనే టాక్‌తో.. ఆమె స్టాల్ దగ్గరికి ప్రజలు పోటెత్తేవారు. సెలబ్రిటీలు సైతం ఆసక్తి చూపారు. దీంతో కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ ప్రాంతంలో రద్దీ పెరిగిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఫుడ్ స్టాల్ తో వాహనదారులకు ఇబ్బందులు వస్తుండటంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని..మరో ప్రాంతంలో పెట్టుకోవాలని ఆదేశించారు.

తన పుడ్ స్టాల్ ను మూసివేయడంతో కుమారీ ఆంటీ రోడ్డెక్కారు. తన పొట్ట కొట్టొదని.. తనకు న్యాయం చేయాలని కోరారు.సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం తెలియడంతో ఆయన వెంటనే స్పందించారు. కుమారి అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతులు జారీ చేయాలని తెలంగాణ డీజీపీ, ఎంఏ యూడీ అధికారులను ఆదేశించారు.త్వరలోనే తాను కుమారి ఫుడ్ స్టాల్‌ను సందర్శిస్తానని చెప్పారు. సీఎం రేవంత్ ఆదేశాలతో కేబుల్ బ్రిడ్జీ సమీపంలోనే పాత ప్లేస్ లోనే కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ కొనసాగిస్తున్నారు. తనకు న్యాయం చేశారంటూ సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు చెప్పారు.

తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కుమారీ ఆంటీ వరద బాధితుల కోసం 50 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. తనకు గతంలో న్యాయం చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు.

Back to top button