తెలంగాణ

సీఎం రేవంత్ పై తిరగబడిన పాలమూరు జనం.. సొంత గడ్డలోనే ఇంత వ్యతిరేకతా!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 నెలల కాలంలోనే సొంత జిల్లాలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పాలమూరు- డిండి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు. తమకు న్యాయం చేస్తారని ఓట్లేసి గెలిపిస్తే కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తమను మోసం చేసి ప్రాజెక్టు పనులు కొనసాగిస్తే కాంగ్రెస్ నేతలను గ్రామాల్లోకి రానీయమని వార్నింగ్ ఇచ్చారు.

ఉద్దండాపూర్ రిజర్వాయర్ పరిశీలించేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవిని అడ్డుకున్నారు ఉద్దండాపూర్ బాధితులు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు ఏమయ్యయాని నిలదీశారు. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరుపున కాదు ప్రజల తరుపున మాట్లాడుతున్న అన్నాడు చెప్పిన అనిరుధ్ రెడ్డి.. ఈరోజు మేము మాట్లాడుతుంటే చెవులు వినివిస్తలేవు అని చెప్తున్నాడని విమర్శించారు. వాళ్ల లబ్ది కోసం ఈరోజు వచ్చారు.. మా ముంపు ప్రాంతం ప్రజల గురించి ఒక్క మాట మాట్లాడలేదని అన్నారు.రేవంత్ రెడ్డి మా జిల్లా వాసి ఆయనకు మా బాధలు తెలుసి కూడా స్వార్ధం చూసుకొని ఆయన 2 నెలల్లోనే కొడంగల్ కి 4300 కోట్లు పట్టుకపోయాడు.. ఇదెక్కడి న్యాయం? అని రైతులు ప్రశ్నించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చాడు ఏమైనా చెప్తాడేమో అనుకుంటే ఆయన ఉత్తగానే వెళ్ళాడు. దగ్గరకి కూడా పోలీసులు మమల్ని రానియ్యలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్యాకేజీ 16,30,000 ఉంటే 25 లక్షలు ఇప్పిస్తా, 18 సంవత్సరాలు దాటిన వారికి.. పెళ్లిలు అయిన వారికి.. ఫుల్ ప్యాకేజీ, ఫ్లాట్లు ఇప్పిస్తా అని ఈరోజు నాకు చేవులు వినిపిస్త లేవు అని ఎమ్మెల్యే అంటున్నాడని.. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వీళ్ళు కాంట్రాక్టర్లు వీళ్ళు పని చేసుకుంటే అడ్డు వస్తే కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారని ఉద్దండాపూర్ భూ నిర్వాసితులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లు అవుతున్నాయన్నారు. తమ ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు అడ్డుకుని తీరుతామన్నారు బాధితులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button