తెలంగాణ

సీఎం రేవంత్ ఇలాఖాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నించినా కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతిన్నది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని మట్టి కరిపించారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. కల్వకుర్తి సమీపంలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్ కార్మిక నాయకుడిగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఐనేని సూర్యప్రకాశరావు విజయం సాధించారు.

సూర్యలత స్పిన్నింగ్ మిల్ కార్మిక సంఘం ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా సాగాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపు కోసం హోరాహోరీగా పోరాడారు. కాంగ్రెస్ అభ్యర్థి కోసం స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రచారం చేశారు. ఎలాగైనా గెలిచేలా పావులు కదిపారు. అయినా గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థి సూర్య ప్రకాశ్ రావు గెలుపొందారు. ఫలితాల తర్వాత మిల్ దగ్గర బీఆర్ఎస్ కార్మక సంఘం నేతలు సంబరాలు జరుపుకున్నారు. గులాబీ పూలు చల్లుకుంటూ.. కేసీఆర్ డీజే పాటలు పెట్టుకుని తీన్మార్ డ్యాన్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత గడ్డలో కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

Back to top button