తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖైరతాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి ఝలక్ ఇచ్చారు. నియజకవర్గ వ్యాప్తంగా విజయారెడ్డి వేసిన పోస్టర్లు కాంగ్రెస్ పార్టీలో సంచలనం రేపుతున్నాయి. గాంధీభవన్ లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
తెలంగాణ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసింది. కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన విగ్రహం కాకుండా కొత్త విగ్రహాన్ని రూపొందించారు సీఎం రేవంత్ రెడ్డి. సోనియాగాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9న సచివాలయం ఆవరణంలో కొత్త విగ్రహాన్నిప్రతిష్టించారు. ఈ సందర్భంగా గ్రాండ్ గా వేడుకలు జరిపారు. లక్ష మంది మహిళలతో సభ నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. టీవీలో, పేపర్లలో యాడ్స్ ఇచ్చారు. ఇక హైదరాబాద్ నగరమంతా భారీగా తెలంగాణ తల్లి ప్లెక్సీలు, బ్యానర్లు కట్టించారు.
అయితే సచివాలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి రూపొందించిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా పాత తెలంగాణ తల్లి విగ్రహ పోస్టర్లను ఏర్పాటు చేశారు విజయారెడ్డి. కేసీఆర్ సర్కార్ రూపొందించిన పాత తెలంగాణ తల్లి పోస్టర్లు పెట్టి నగరంలో పలుచోట్ల స్తంభాలకు అంటించారు కార్పొరేటర్ విజయ రెడ్డి. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో చర్చ మారింది.