ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనలు ప్రతిరోజు కూడా కొన్ని కొత్త నిర్ణయాలను అయితే తీసుకుంటున్నారు. ఇక తాజాగా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అమలు చేసినటువంటి కొన్ని కొత్త విధానాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు కొన్నిటిని రద్దు చేశారు.
వైసిపి ప్రభుత్వం లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలు గా మార్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటుచేసిన 26 జిల్లాలు వల్ల ఎక్కడ కూడా పెద్దగా సమస్యలు లేకపోయినా పలుచోట్ల మాత్రం జిల్లాల పేర్లను మార్చాలని ఇంకొన్ని చోట్ల కలెక్టర్లకు భవనాలు లేకపోవడంతో కలెక్టర్ల కోసం మధ్య భవనాలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కాబట్టి కొత్త జిల్లాల వల్ల ప్రయోజనం కంటే నష్టం ఎక్కువగా ఉందని భావించిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరిగి కొత్త జిల్లాలన్నింటిని కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అయితే అందింది. ప్రస్తుతం వీటిపై చర్చలు కూడా జరుగుతున్నాయట. ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల గురించి ఒక ప్రకటన వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది.
ఇక జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఇసుక, మద్యం పాలసీలు అనేవి రద్దుచేసి ఉచిత ఇసుక పాలసీని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు. కాబట్టి త్వరలోనే 26 జిల్లాలోని ప్రతిపాదికను కూడా రద్దు చేసేటువంటి ఆలోచనలు చంద్రబాబు ఉన్నట్లుగా సమాచారం అందింది.