Tuesday, February 24, 2026
Homeతెలంగాణసినిమాల్లో భోగం వేషాలు వేసేదానా.. మళ్లీ ఎమ్మెల్యే దానం బూతులు

సినిమాల్లో భోగం వేషాలు వేసేదానా.. మళ్లీ ఎమ్మెల్యే దానం బూతులు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ మరోసారి నోరు జారారు. బహిరంగంగానే బూతులు మాట్లాడారు. గాంధీభవన్ వేదికగానే అసభ్యపదాలతో విరుచుకుపడ్డారు. ఇటీవలే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మహిళలను దానం అవమానించారని గులాబీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేష్ వేడుకల్లో భాగంగా ఖైరతాబాద్ మహా గణపతి మండపం దగ్గర మరోసారి బూతులు అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే భక్తులకు బూతులు తిట్టారు. ఆయన మాట్లాడిన బూతు మాటలు మైకులో అందరికి వినిపంచాయి.

తాజాగా బీజేపీ మహిళా ఎంపీని టార్గెట్ చేశారు దానం నాగేందర్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని చంపేయాలంటూ కేంద్రమంత్రి రణవీర్ చేసన కామెంట్లకు నిరసనగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించింది. గాంధీభవన్ లోనూ టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే దానం నాగేందర్.. బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “సినిమాల్లో భోగం వేషాలు వేసే కంగనా రనౌత్” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దానం మాటలపై బీజేపీ నేతలు ఫైరవుతున్నారు. నాగేందర్ నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments