జాతీయం

సిద్దరామయ్య అవుట్.. సీఎంగా డీకే.. పొంగులేటితో రేవంత్ కు టెన్షన్

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ముడా స్కాంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ వస్తోంది. అవినీతి సీఎం తప్పుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, జేడీఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. సిద్దరామయ్య విషయంలో అధికార కాంగ్రెస్ లోనూ వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయన సీఎం పదవికి రాజీనామా చేయలని కొందరు కోరుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అనుచరులు ఈ డిమాండ్ చేస్తున్నారని టాక్.

కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా రంగంలోకి దిగిందని సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్దరామయ్యను తప్పించే యోచనలో కాంగ్రెస్ ఉందంటున్నారు. సిద్దరామయ్యను తప్పిస్తే… కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడే డీకేకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే చర్చ సాగింది. కాని హైకమాండ్ మాత్రం మరోసారి సిద్దరామయ్యకు అప్పగించింది. అయితే మొదటి రెండేళ్లు సిద్దరామయ్యకు.. చివరి మూడేండ్లు డీకే శివకుమార్ సీఎంగా ఉండాలనే డీల్ కుదిరినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఒప్పందంలో భాగంగానే డీకేకు ఇప్పుడు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. డీకే సీఎం కావడం ఖాయమని ఆయన అనుచరులు పూర్తిగా ధీమాగా ఉన్నారంటున్నారు.

Read More : RRR రికార్డులు బద్దలు.. దేవర్ తొలి రోజు కలెక్షన్ ఎంతో తెలుసా..

మరోవైపు మైసూరు నగరాభివృద్ధి సంస్థ స్థలాల పంపిణీ అక్రమాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. మైసూరు లోకాయుక్త ఎస్పీ ఉదేశ్‌ ఈ కేసు నమోదుచేశారు. ముడా అక్రమాలపై విచారణ చేపట్టిన సంబంధిత కోర్టు.. 3 నెలల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇటీవల లోకాయుక్తను ఆదేశించిన క్రమంలో ఈ చర్యలు చేపట్టారు.ఈ కేసులో ముఖ్యమంత్రి ఏ1, ఆయన సతీమణి పార్వతి ఏ2, బావమరిది మల్లికార్జున స్వామి ఏ3, భూములు విక్రయించిన దేవరాజు ఏ4, ఇతరులను ఏ5 నిందితులుగా పేర్కొన్నారు. సీఎంపై భూ ఆక్రమణల నియంత్రణ, అవినీతి నిరోధక, ఫోర్జరీ, బినామీ ఆస్తుల పరిరక్షణ, అధికార దుర్వినియోగం అభియోగాల కింద పలు సెక్షన్లు పెట్టారు.

Read More : హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య!

కర్ణాటక పరిణామాలు తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయనే చర్చ సాగుతోంది. రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు తెలంగాణ కాంగ్రెస్ కలకలం రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గానే పొంగులేటి నివాసంలో సోదాలు జరిగాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. దీంతో ఇది ఎటు వైపు దారి తీస్తుందోనన్న ఆందోళన గాంధీభవన్ వర్గాల్లో కనిపిస్తోంది.

Back to top button