జాతీయం

శబరిమలలో భారీ వర్షం.. అయ్యప్ప స్వాములకు నరకం

శబరిమలలో నెల దర్శనం, నక్షత్ర దర్శనాల కోసం అయ్యప్ప భక్తులు ముందుగా టికెట్లు బుక్ చేసుకుని.. భారీగా తరలివచ్చారు.

శబరిమలకు అయ్యప్ప స్వాములు పోటెత్తుతున్నారు.  భక్తులు భారీగా వస్లుండటంతో కొండపై భారీగా రద్దీ నెలకొంది. పంబ నుంచి సన్నిధానం వరకు వేచి ఉన్నారు భక్తులు. అయితే సరైన సౌకర్యాలు కల్పించడంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం, కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యాయని.. అయ్యప్ప భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నా.. కనీసం తాగునీరు లాంటి మౌలిక వసతులు కల్పించడం లేదని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయ్యప్ప దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో..6 గంటలకుపైగా క్యూలైన్లలోనే పడిగాపులు కాస్తున్నారు.

శబరిమలలో నెల దర్శనం, నక్షత్ర దర్శనాల కోసం అయ్యప్ప భక్తులు ముందుగా టికెట్లు బుక్ చేసుకుని.. భారీగా తరలివచ్చారు. అయితే భారీగా వచ్చిన భక్తులతో రద్దీ నెలకొనడంతో 6 గంటలకుపైగా క్యూలైన్లలోనే పడిగాపులు కాస్తున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులను అధికారులు అనుమతించకపోవడంతో క్యూలైన్లలోనే తోపులాటలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక క్యూలైన్లలో చాలా మంది పిల్లలు, వృద్ధులు, అయ్యప్ప మాలదారులు ఉన్నారు. అంతేకాకుండా శబరిమలలో ప్రస్తుతం ఓవైపు భారీగా వర్షాలు కురుస్తుండగా.. మరోవైపు.. చలిగాలులు వీస్తున్నాయి. ఇక భారీగా తరలివచ్చిన వారికోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనాలు లేకపోవడంతో పాటు కనీసం తాగునీరు కూడా లేకపోవడంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు వ్యతిరేకంగా క్యూలైన్లలోనే భక్తులు నిరసన చేస్తున్నారు.

శబరిమలలో నవంబరు 15వ తేదీ నుంచి డిసెంబరు 26వ తేదీ వరకు మండల పూజలు కొనసాగనున్నాయి. అనంతరం రెండు రోజుల పాటు శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ తర్వాత డిసెంబరు 30వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు మకర విళక్కు పూజలు జరగనుండగా.. చివరిరోజు పడిపూజతో దర్శనాలు ముగియనున్నాయి. జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం.. కలగనుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శన వేళలను ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పెంచింది.

మరిన్ని వార్తలు చదవండి…

పదవులకు వేలం పెట్టిన మధుయాష్కీ పీఆర్వో! ఎల్బీనగర్ కాంగ్రెస్‌లో ముసలం

జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్

అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?

కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్

జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు

నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం 

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం 

కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి

సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక

అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్

కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్

ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!

8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్

రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్

గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా

పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button