క్రైమ్ మిర్రర్, ఖమ్మం ప్రతినిధి : సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ కేంద్ర కంట్రోల్ కమిటీ చైర్మన్, కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ (75) వ్యక్తిగత కారణాలతో ఖమ్మంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రాయల చంద్రశేఖర్ భౌతిక కాయాన్ని గురువారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఖమ్మం కార్యాలయానికి ప్రజల సందర్శనార్థం తరలించారు. ఎంపీలు రేణుకాచౌదరి, రాఘురామరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు సందర్శించి నివాళులు ఆర్పించారు. రాయల చంద్రశేఖర్ మృతి పట్ల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సంతాపం ప్రకటించారు. అనంతరం పిండిప్రోలులో ఆయన అంతిమ యాత్ర నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే విప్లవోద్యమానికి ఆకర్షితుడైన రాయల చంద్రశేఖర్ పీడీఎ్‌సయూలో కీలకంగా పనిచేశారు. 1975లో విప్లవోద్యమంలో రహస్య కార్యకర్తగా అడవిబాట పట్టారు. ఆ తర్వాత రైతు కూలీ సంఘం నాయకుడిగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో పార్టీ నిర్మాణాకి కృషి చేశారు.
ఇవి కూడా చదవండి :