Monday, February 23, 2026
Homeక్రైమ్వీపు తోమాలన్న భర్త తల పగలకొట్టిన భార్య.. కూకట్‌పల్లిలో దారుణం

వీపు తోమాలన్న భర్త తల పగలకొట్టిన భార్య.. కూకట్‌పల్లిలో దారుణం

హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణ ఘటన జరిగింది. భార్య తల పగలకొట్టడంతో భర్త ప్రాణాలతో పోరాడుతున్నాడు. స్నానం చేసే సమయంలో భర్త వీపు తోమాలని భార్య పై గట్టిగా కేకలు వేయడంతో క్షణికావేశంలో ఐరన్ రాడ్ తో భర్త తలపై కొట్టి గాయపరిచిన ఘటన కేపి.హెచ్.బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడవ రోడ్డు లో చోటుచేసుకుంది.

నల్లగొండ జిల్లాకు చెందిన శివ తన భార్య పిల్లలతో కలిసి కేపి.హెచ్.బీ కాలనీ మూడవ రోడ్డులో నివాసం ఉంటున్నాడు ఉదయం శివ స్నానం చేసే సమయంలో వీపుతోమాలని భార్యపై గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వింటే బాగోదు అని భార్య చెప్పడంతో ఆమెతో వాగ్వాదానికి దిగాడు దీనితో భార్య అక్కడే ఉన్న ఐరన్ రాడ్ తో భర్త తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు ఘటన పైన భర్త శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments