విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.17,000 కోట్ల అప్పులున్నాయని కేంద్రం చెబుతోంది. అలాంటప్పుడు కేవలం రూ.11,500 కోట్లు కేటాయించడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ఆ ప్లాంట్‌ను కాపాడేందుకు శాశ్వత పరిష్కారం చూపాలి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ‘విశాఖ ఉక్కుకు ముడి ఇనుము గనులు కేటాయించి, సెయిల్‌లో విలీనం చేయాలి. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించకుండా అనకాపల్లిలో దాదాపు రూ.70 వేల కోట్లతో మిట్టల్ ఏర్పాటు చేయనున్న ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌కు కేటాయిస్తే.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదు’ అని రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
1.అన్ని హామీలు నెరవేరుస్తాము!… కేటీఆర్ స్కాములు కూడా బయటికి తీస్తాం?
2.ఎప్రిల్ కోటా టీటీడీ టికెట్లు విడుదల