క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ విభేదాలు క్రమంగా ముదురుతున్నాయి. కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్ల దుమారం మరవకముందే కాంగ్రెస్ లో మరో ఘటన జరిగింది. ఆదిలాబాద్ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. తమను అవమానించారంటూ రామగుండం సింగరేణి ఇల్లందు గెస్ట్ హౌస్ నుండి అలిగి వెళ్లిపోయిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి వెళ్లిపోవడం కాక రేపుతోంది.
రామగుండంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ల పర్యటన ఆలస్యం కావడంతో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రుల పర్యటన సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పెద్ద ఫ్లెక్సిలు ఏర్పాటు చేయడంపై మంత్రుల ముందు కోపం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చాలా ఆలస్యం కావడంతో చెన్నూరు నియోజకవర్గ పర్యటన రద్దు చేసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్.
Read More : విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి క్లోజ్
డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన రద్దు కావడం.. మంత్రుల వద్ద మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యవహార శైలిపై కోపంతో వున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారంటున్నారు. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యే వివేక్ వెళ్లి పోయాక రామగుండంలో పర్యటన కొనసాగించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు. రామగుండంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి శ్రీధర్ బాబు.. కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ప్రేమ్ సాగర్ రావు పార్టీ కోసం చేసిన కృషి తెలుసు అన్నారు. ప్రేమ్ సాగర్ రావు అభిమానులు, కార్యకర్తల మనోభావాలను అధిష్టానం గుర్తించింది అని ఇన్ డైరక్ట్ గా ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి రాబోతున్నదని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు.
తమకు జరిగిన అవమానంపై రగిలిపోతున్న వివేక్ వెంకటస్వామి.. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్య నాయకుల తో సమావేశం అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ని చెన్నూరుకు తీసుకువస్తానని చెప్పారు.