తెలంగాణ

విద్యాశాఖ మంత్రిగా కోదండరాం!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం ఆరు ఖాళీలు ఉన్నాయి. ఆరు భర్తీ చేస్తారా లేక నాలుగు భర్తీ చేస్తారా అన్న విషయంలో క్లారిటీ లేదు. కాని కేబినెట్ విస్తరణ మాత్రం పక్కా అని సమాచారం.

తెలంగాణకు కొత్త విద్యా శాఖ మంత్రిగా తెలంగాణ ఉద్యమ నేతకు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరామ్ ను కేబినెట్ లోకి తీసుకుని కీలకమైన విద్యాశాఖను అప్పగిస్తారని టాక్. కోదండరామ్ ఎమ్మెల్సీ పదవి కూడా క్లియరైంది. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శాసనమండలి సభ్యుడిగా ప్రమాణం చేశారు కోదండరామ్. దీంతో అతని మంత్రిపదవికి లైన్ క్లియరైంది.

రేవంత్ సర్కారులో విద్యా శాఖ మంత్రి లేడు. దాన్ని కోదండరాంకు ఇవ్వాలని రేవంత్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఎన్నికల్లో కాంగ్రెస్ కు కోదండరామ్ సహకరించారు. ప్రజాభిమానం ఉన్న ఉద్యమకారుడు. కేసీఆర్ అవమానించాడనే అభిప్రాయం జనాల్లో ఉందిసిన. విద్యావేత్త అండ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసిన అనుభవం ఉంది. అందుకే కీలకమైన విద్యాశాఖను కోదండరామ్ కు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారని.. అందుకు హైకమాండ్ కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది.

Related Articles

Back to top button