Tuesday, February 24, 2026
Homeజాతీయంవరదల్లో చిక్కుకున్న హీరో నాగార్జున కారు...?

వరదల్లో చిక్కుకున్న హీరో నాగార్జున కారు…?

హీరో అక్కినేని నాగార్జున ఇవాళ వరదల్లో చిక్కుకున్నారు. అనంతపురంలో జూలరీ షాప్ ఓపెనింగ్ లో భాగంగా ఇవాళ అక్కినేని నాగార్జున అనంతపురానికి బయలుదేరాడు. పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురానికి వెళుతుండగా ఆ సమయంలోనే అతని కారు వరదల్లో చిక్కుకుంది. ఇక వెంటనే విషయం తెలుసుకున్న పుట్టపర్తి పోలీసులు హీరో నాగార్జున కారుని పుట్టపర్తి నుండి మరొక మార్గంలో అనంతపురంకి చేరేలా సహాయం చేశారు.

అయితే నిన్న రాత్రి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలకు పండమేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ వాగుకు ఇరువైపులో ఉన్నటువంటి కాలనీలు అనేవి పూర్తిగా నీట మునిగిపోయాయి. వరద ప్రవాహంలో చిక్కుపోయిన ప్రజలందరూ కూడా ఇళ్లపై ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికే అనంతపురంలో సహాయక చర్యలు అనేవి చేపట్టారు. వరద బాధితు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే హీరో నాగార్జున కారు అందులో చిక్కుకు పోయింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments