ఆంధ్ర ప్రదేశ్

వరదలో శవాల కుప్పలు.. విజయవాడలో కన్నీటి దృశ్యాలు

వరదలతో విలవిలలాడిన విజయవాడలో హృదయ విదాకర దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఐదు రోజులునా ఇంకా వరద తగ్గడం లేదు. ఇప్పటీకీ దాదాపు వంద కాలనీలో నీటిలోనే ఉన్నాయి. సహాయ చర్యలు కొనసాగుతున్నా వరద ఇంకా తగ్గడం లేదు. వరద తగ్గే కొలది బురదతో శవాలు తేలుతున్నాయి. బుడమేరు వరదలో కొట్టుకుపోయిన వ్యక్తుల శవాలు బురదలో కూరుకుపోయాయి. వరద తగ్గాకా అధికారులు బురదను తొలగిస్తుండగా శవాలు బయటపడుతున్నాయి.

వరద ప్రభావం ఎక్కువగా ఉన్న సింగ్ నగర్ లో పరిస్థితి దారుణంగా ఉంది. విజయవాడ వరదల్లో 12 మంది చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది. కాని వంద మందికి పైగా వరదలకు బలయ్యారని తెలుస్తోంది. చాలా మంది గల్లంతు కావడంతో వాళ్లంతా ఏమయ్యారు.. వరదలో కొట్టుకుపోయారా.. ఎక్కడైనా చిక్కుకుని క్షేమంగా బయటపడ్డారా అన్నది తేలడం లేదు.

విజయవాడ చిట్టినగర్ పరిధిలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన 14 ఏళ్ల బాలుడు వరద నీటిలో శవమై తేలాడు. బురద కాస్త తగ్గగా.. అతని శవం కనిపించింది. నడుములోతు నీటిలో మృతదేహాన్ని తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. కొడుకుని తరలిస్తుండగా తల్లి రోదిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.ఇలాంటి ఘటనలు అందరిని కలిచివేస్తున్నాయి. బురదను తొలగిస్తే ఇంకా ఎన్ని శవాలు బయటపడతాయోనన్న ఆందోళన నగరవాసుల్లో కనిపిస్తోంది.

Back to top button