జాతీయం

వయనాడ్‌లో ప్రియాంకపై బీజేపీ బ్రహ్మాస్త్రం.. ఎవరీ నవ్య హరిదాస్!

లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది.జార్కండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన 24 అసెంబ్లీ, కేరళలోని వయనాడ్ లోక్ సభకు ఉఫ ఎన్నిక జరనగుంది. దీంతో వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే 24 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కేరళలోని వయనాడ్ లోక్‌సభకు నవ్య హరిదాస్‌ పేరును ప్రకటించింది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ని ఇప్పటికే తమ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

వయనాడ్ లో బీజేపీ అభ్యర్థిపై జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. బీజేపీలో డైనమిక్ లీడర్‌గా నవ్య హరిదాస్ పేరు తెచ్చుకున్నారు. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన నవ్య హరిదాస్ 2007లో బీటెక్ పూర్తి చేసారు. కోజికోడ్ కార్పొరేషన్‌కు రెండుసార్లు కౌన్సిలర్‌‌గా ఉన్నారు. కార్పొరేషన్‌లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. 2021లో జరిగిన కోజికోడ్ సౌత్ నియోజవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు.

వయనాడ్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై నవ్య హరిదాస్ స్పందించారు. వయనాడ్ ప్రజలతో మేకమయ్యే వ్యక్తిగా తనను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వయనాడ్ తో పాటు యూపీలోని అమేథీలో రాహుల్ గాంధీ పోటీ చేశారు. రెండు చోట్ల రాహుల్ గాంధీ గెలవడంతో వయనాడ్ నియోజకవర్గాన్ని ఆయన వదులుకున్నారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. రాహుల్ స్థానంలో ప్రియాంక గాంధీ వాద్రా ను ఉప ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ దింపుతోంది. ప్రియాంక గాంధీపై వ్యూహాత్మకంగా బీజేపీ నవ్య హరిదాస్‌ ను రంగంలోకి దింపింది.

Back to top button