తెలంగాణనల్గొండ
Trending

సైబర్ నెరగాళ్ళ లింకు ఓపెన్ చేశారో…. ఎకౌంట్లో పైసలు మాయం….

చండూరు,క్రైమ్ మిర్రర్: సైబర్ నేరాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్తగా నేరాలకు పాల్పడుతున్నారు. బ్యాంకుల పేరుతో మన వాట్సాప్ లకు లింకు పంపిస్తున్నారు. బ్యాంకు పేరు ఉండడంతో లింకు ఓపెన్ చేస్తే చాలు ఆ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు క్షణాల్లో మాయమవుతున్నాయి. చండూరులో గత రెండు రోజులుగా ఓ బ్యాంకుకు సంబంధించిన వాట్సప్ మెసేజ్ వస్తోంది. ఆ బ్యాంక్ అకౌంట్ కలిగిన ఖాతాదారులు బ్యాంకు వారు ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ పంపారని భావించి లింకు ఓపెన్ చేస్తున్నారు. ఎకౌంట్లో నుంచి డబ్బు మాయమైపోతుంది. ఇలా ఓ వ్యక్తి రూ.లక్ష మరో వ్యక్తి రూ.23 వేలు పోగొట్టుకున్నారు. బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను, స్థానిక పోలీసులను ఆశ్రయించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి.ఇలాంటి వాట్సాప్ మెసేజ్ ల పట్ల ప్రజలను అవగాహన పరచాల్సిన బాధ్యత అందరి పైన ఉంది.

Back to top button