క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : ఆధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ పర్యటనకు రెడీ చేసుకుంటున్నారు. ఇటీవల ఆయన విజయవాడలో తన పాస్ పోర్టు రెన్యూవల్ చేసుకున్నారు. తాజాగా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే నెలలో తాను బ్రిటన్ పర్యటనకు వెళ్లాలనుకుంటున్నానని పర్మిషన్ ఇవ్వాలని ఆ పిటిషన్ లో కోరారు. జగన్ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది. అటు విజయసాయిరెడ్డి కూడా విదేశీ పర్యటనకు అనుమతి కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ పై తీర్పు ఈనెల 30వ తేదీన రానుంది.
Read More : కవితకు బెయిల్ ఇప్పిస్తున్న సీఎం రేవంత్ లాయర్!
జగన్ లండన్ పర్యటనపై టీడీపీ నేతలు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దోచుకున్న డబ్బును దాచడానికే లండన్ వెళుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఓటమి తర్వాత ఏపీలో ఎక్కువగా ఉండటం లేదు జగన్. మూడు నాలుగు రోజులు తాడేపల్లిలో ఉంటూ బెంగళూరు వెళుతున్నారు. అక్కడి నుంచే తన పనులు చక్కబెట్టుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. తాజాగా లండన్ వెళ్లడానికి రెడీ కావడంతో ఆయన పర్యటన రాజకీయంగా కాక రేపుతోంది.