యూట్యూబర్లకు తెలంగాణ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. రీల్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బందికలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీడియోల కోసం ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని సూచించారు. ఇలాంటి దుశ్చర్యలకుపాల్పడితే కేసులు తప్పవని స్పష్టం చేశారు హైదరాబాద్ పోలీసులు. కూకట్ పల్లిలో ఇట్స్ మి పవర్, పవర్ హర్ష పేరుతో ఐడీ కలిగిన ఓ యూట్యూబర్ రోడ్డు మీద డబ్బులు చల్లుతూ రీల్స్చేశాడు. ఆ నోట్లను ఏరుకునేందుకు నడిచివెళ్లేవారు, వాహనదారులు పోటీ పడ్డారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది.
హర్షకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్చేసిన ఆ యూట్యూబర్ పై చర్యలు తీసుకోవాలని ఆన్లైన్ లో పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యూట్యూబర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇక యూట్యూబర్ హర్షపై కేసు నమోదు చేశారు పోలీసులు. డబ్బులు విసిరేస్తూ రోడ్లపై హల్‌చల్ చేసిన హర్ష అనే యువకుడి మీద సనత్‌నగర్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కేపీహెచ్‌బీలో మరో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు.
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువత వింత చేష్టలకు పాల్పడుతోంది. చాలా మంది రోడ్ల మీద డబ్బులను విసరడం, వల్గారిటీతో వీడియోలు చేయడం, రోడ్ల మీద మనీ స్టిక్కర్లు అంటించి వీడియోలు తీసి అప్లోడ్చేయడం, బైకులపై డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తులపై పోలీసులు దృష్టిసారించి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.