Uncategorized

రైతు రుణమాఫీకీ మార్గదర్శకాల జారీ.. అదే ప్రామాణికం!!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతు రుణ మాఫీకి సిద్ధమైంది.. ఆగస్టు 15 నాటికి కచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు.. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి మార్గదర్శకాలను జారీ చేసింది.. ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షలు రుణమాఫీ చేయనున్నట్లు వెల్లడించింది.. రుణమాఫీ స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుందని తెలిపింది. 12-12-2018 నుంచి 09-12-2023 మధ్య తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని.. ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) ప్రామాణికంగా రైతు రుణమాఫీ ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది.. రుణమాఫీ అమలుకు ప్రతి బ్యాంక్‌కు ఒక నోడల్ అధికారిని నియమించి.. రైతు రుణ మాఫీ పేర్లను సెలక్ట్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. అన్నదాతలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  2. వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్ సంచిత్ గంగ్వార్
  3. కేఎస్‌ఆర్టీసీ బాటలో టీజీఎస్‌ఆర్టీసీ.. బస్సు ఛార్జీల పెంపుపై కేటీఆర్ ట్వీట్!!
  4. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుండి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు!!!
Spread the love
Back to top button