తెలంగాణ

రేవంత్ రెడ్డిపై ఈడీ ఫోకస్! తెలంగాణ కాంగ్రెస్ లో కలవరం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు వెళ్లింది. రేవంత్ పై వచ్చిన ఫిర్యాదును ఈడీ స్వీకరించడం సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి డపై వచ్చిన ఫిర్యాదుపై ఈడీ దర్యాప్తు చేస్తే కీలక పరిణామాలు జరుగుతాయనే చర్చ సాగుతోంది. ఈడీ కేసులో రేవంత్ రెడ్డి బుక్ కావడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

ఇటీవలే అమెరికాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి స్వచ్ బయో డీల్ సంస్థలో ఒప్పందం చేసుకున్నారు. ఈ డీల్ పై పెద్ద వివాదం సాగింది. స్వచ్ బయో డీల్ సంస్థలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుగు ఎనుముల జగదీశ్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఇతర డైరెక్టర్లు కూడా రేవంత్ అనుచరులనే విమర్శలు వచ్చాయి. అంతేకాదు నెల రోజుల క్రితమే ఈ సంస్థ ఏర్పాటైందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలు విడుదల చేసింది.

Read More : రేవంత్ రెడ్డికి మేథావుల షాక్.. మార్చాలంటూ రాహుల్ కు బహిరంగ లేఖ 

సీఎం రేవంత్ అమెరికా పెట్టుబడులపై వివాదం సాగుతుండగానే కీలక పరిణామం జరిగింది. స్వచ్ బయో డీల్ సంస్థపై ఈడీ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో పిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిశాంక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వారి తమ్ముడు అనుముల జగదీశ్ రెడ్డి విచారణ జరిపించాలని ఈడీకి పిర్యాదు చేశారు.

ఈడీకి అన్ని ఆధారాలు ఇచ్చానని తెలిపారు క్రిశాంక్. ఆ సంస్థకు డైరెక్టర్ గా ఉన్న అనుముల జగదీశ్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి పై విచారణ చేయాలని కోరినట్లు చెప్పారు. తన ఫిర్యాదును ఈడి అధికారులు తీసుకున్నారన్నారు క్రిషాంక్. విచారణ చేపడుతాం అని చెప్పారన్నారు. రేవంత్ రెడ్డిపై మన్నె క్రిషాంక్ ఇచ్చిన ఫిర్యాదును ఈడీ తీసుకోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఈ కేసులో రేవంత్ రెడ్డిని ఈడీ విచారిస్తుందా.. విచారిస్తే ఏం జరుగుతుందోనన్న ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది.

Back to top button