తెలంగాణ

రేవంత్ పై తిరుగుబాటు.. ప్రజాభవన్ ముట్టడించిన దళితులు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో దళితులు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధుకు ఎంపికైన లబ్దిదారులకు డబ్బులు విడుదల చేయనందుకు ప్రజా భవన్ ను ముట్టడించారు దళిత సోదరులు.అయితే ప్రజా భవన్ లోపలికి వెళ్లకుండా దళితులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దళితులను బలంవంతగా అక్కడి నుంచి తరలించారు పోలీసులు.

ప్రజా పాలన అన్న కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు కనీసం ప్రజా భవన్ కు వస్తే భట్టి విక్రమార్క , సితక్క లు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం పై ప్రజాభవన్ వద్ద అసహనం వ్యక్తం చేశారు దళితలు.స్థానిక సంస్థల ఎన్నికల లోపు దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ఉద్యమ తరహాలో తమ పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు దళితులు. సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Back to top button