ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

రేవంత్ టీంతో జగన్.. బాబు టీంతో కేటీఆర్! సీన్ రివర్స్

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చే పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తిగా మారాయి. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధం అందరికి తెలిసిందే. వాళ్లిద్దరి గురుశిష్యుల బంధం. రేవంత్ రెడ్డికి నష్టం కలిగించేలా చంద్రబాబు… చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరనే టాక్ ఉంది. ఇక ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. 2019లో జగన్ గెలుపు కోసం కేసీఆర్ చాలా చేశారనే ప్రచారం ఉంది. అదే సమయంలో కేసీఆర్ కు అసెంబ్లీలోనే సెల్యూట్ చేశారు వైఎస్ జగన్. వాళ్లిద్దరు కూడా ఒకరికి ఒకరు నష్టం కలిగేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదంటారు.

తెలుగు రాష్ట్రాల్లో తాజాగా కనిపిస్తున్న సీన్లు మాత్రం పూర్తి రివర్స్ గా కనిపిస్తున్నాయి.చంద్రబాబు గెలుపు కోసం పని చేసిన టీంతో కేటీఆర్.. రేవంత్ రెడ్డి విజయంలో కీ రోల్ పోషించిన టీంతో వైఎస్ జగన్ డీల్స్ చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

2024 ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ కోసం ఐప్యాక్ టీం పని చేసింది. టీడీపీ కోసం పీకే టీం మాజీ సభ్యుడు రాబిన్ శర్మ టీం వర్క్ చేసింది. ఎన్నికల్లో టీడీపీ కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. ఎవరూ ఊహించని విధంగా కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితమైంది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఏ ఏజెన్సీలను పెట్టుకోలేదు. ప్రశాంత్ కిషోర్ తో డీల్ చేసుకోవాలని కేటీఆర్ సూచించినా కేసీఆర్ వద్దని చెప్పారని టాక్. అటు కాంగ్రెస్ మాత్రం సునీల్ కనుగోలుతో డీల్ చేసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి సునీల్ కనుగోలు టీం వ్యూహాలే పని చేశాయని అంటున్నారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్ విజయంలో సునీల్ కనుగోలు బృందం కీ రోల్ పోషించింది. అయితే ఎన్నికల్లో ఓటమితో అటు జగన్.. ఇటు కేటీఆర్ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా బలమైన వ్యూహకర్తల కోసం చూస్తున్నారు. పీకేతో వర్క్ చేయించుకుంటే ఫలితాలు మరోలా ఉండేవనే భావనలో ఉన్న కేటీఆర్.. ఇప్పుడు వ్యూహకర్త కోసం చూస్తున్నారని తెలుస్తోంది. ఏపీలో టీడీపీని గెలిపించిన రాబిన్ శర్మ టీంతో కేటీఆర్ అనుచరులు ఇప్పటికే టచ్ లోకి వెళ్లారంటున్నారు. రాబిన్ శర్మతో బీఆర్ఎస్ డీ్ కుదిరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పార్టీ బలోపేతంతో పాటు పార్టీలో గ్రామ స్థాయి నుంచి పునర్ నిర్మాణం దిశగా మొదట రాబిన్ శర్మ టీంతో వర్కవుట్ చేసే యోచనలో కేటీఆర్ ఉన్నారంటున్నారు. వచ్చే రెండేళ్లు పార్టీ నిర్మాణంపై ఫోకస్ చేసి.. తర్వాత రెండేళ్లు ఎన్నికల దిశగా వెళ్లాలని కేటీఆర్ ప్లాన్ చేశారని అంటున్నారు.

ఇక ఏపీలో ఘోరపరాజయం తర్వాత వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎక్కడికక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు గురవుతున్నారు. చాలా మంది నేతలు భయంతో గ్రామాలు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ద్వితియ శ్రేణి నేతలంతా అధికార పార్టీ గూటికి చేరుతున్నారు. దీంతో పార్టీని కాపాడుకునే పనిలో పడిన జగన్.. కేడర్ లో జోష్ నింపేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఐప్యాక్ కాకుండా మరో వ్యూహకర్త కావాలని చూస్తున్నారట. తెలంగాణలో కాంగ్రెస్ కోసం పని చేసిన సునీల్ కనుగోలు టీం కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. సునీల్ కనుగోలు మొదటగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కోసం పని చేశారు. జగన్ తో డీకేకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో డీకే ద్వారా సునీల్ కనుగోలుతో జగన్ డీల్ చేస్తున్నారని అంటున్నారు. సునీల్ కనుగోలుకు పెద్ద మొత్తంలో జగన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఇటీవల తాడేపల్లి కంటే ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు జగన్. అక్కడే సునీల్ టీంతో జగన్ చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇలా మొత్తంగా చంద్రబాబును గెలిపించిన టీంతో కేటీఆర్.. తెలంగాణలో రేవంత్ రెడ్డిని గెలిపించిన టీం కోసం వైఎస్ జగన్ ప్రయత్నాలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button