క్రైమ్

రెడ్డీనే స్టేషన్ పిలిపిస్తవా.. పోలీసుల ముందే సీఐపై దాడి!

తెలంగాణ పోలీస్ వ్యవస్థ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఓ పోలీస్ స్టేషన్ లో పోలీసుల కళ్ల ముందే.. ఆ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ చెంప చెల్లుమన్నదని తెలుస్తోంది. తననే పోలీస్ స్టేషన్ పిలిపిస్తారా అంటూ రెచ్చిపోయిన ఓ సినీ నిర్మాత.. పోలీసుల ముందే సీఐని కొట్టినట్లు తెలుస్తోంది.

ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. విషయం తెలియడంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు.. ఇద్దరి మధ్య సెటిల్ మెంట్ చేసి ఇష్యూ బయటికి రాకుండా చేశారని సమాచారం. అయితే ఇద్దరి మధ్య సెటిల్ మెంట్ చేసినా పోలీసులు మాత్రం ఈ ఘటనపై రగిలిపోతున్నారని టాక్.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఓకేసు విషయమై మాట్లాడేందుకు నిర్మాత ను పోలీస్ స్టేషన్ పిలిచాడు ఓయూ ఇన్స్పెక్టర్.అయితే స్టేషన్ కు వచ్చిన సదర్ నిర్మాత.. మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి పిలుస్తావా అంటూ ఇన్స్పెక్టర్ పై దాడి చేశారని తెలుస్తోంది. నిర్మాత అతని అనుచరులు కూడా ఇన్స్పెక్టర్ పై దాడికి తెగబడ్డారని చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సీనియర్ అధికారులు రంగంలో దిగారంటున్నారు.

తార్నాక హనుమాన్ నగర్ లోని స్పోర్ట్స్ స్క్వేర్ గేమింగ్ జోన్ లో దసరా పండుగ సందర్భంగా కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని విచారణ నిమిత్తం నిర్వాహకులను స్టేషన్ కి పిలిపించారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు సిఐ పై దాడి చేశారని తెలుస్తోంది. ఈ తతంగమంతా ఓయూ డివిజన్ ఏసిపి, అడిషనల్ డీసీపీ నరసయ్య ఎదుటే జరగిందని అంటున్నారు. దాడి చేసిన నిర్మాత రెడ్డి కావడంతో ఇష్యూ పెద్దది కాకుండా సెటిల్ చేశారని అంటున్నారు.

Back to top button