నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వీరేశానికి ఘోర అవమానం జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో ఎమ్మెల్యేను గుర్తుపట్టలేదు పోలీసులు. ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేనని చెప్పినా వినలేదు పోలీసులు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికేందుకు లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో పోలీసుల తీరుతో విసిగిపోయిన ఎమ్మెల్యే వేముల వీరేశం.. కామన్ సెన్స్ లేదంటూ పోలీసు అధికారులను తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే వేముల వీరేశం వెళుతుండగా ప్రభుత్వ విప్, ఆలేరు బీర్ల ఐలయ్య వారించే ప్రయత్వం చేశారు. అయినా వీరేశం వినలేదు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి లోపలికి వెళ్దాం పద అంటూ చేయి పట్టి లాగినా వీరేశం మాత్రం వెనక్కి వెళ్లిపోయారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. వేముల వీరేశానికి జరిగిన అవమానం తెలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. అక్కడే ఉన్న పోలీసు అధికారులపై సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేను గుర్తుకు పట్టకపోతే ఎలా క్లాస్ పీకారు.
దళిత ఎమ్మెల్యేను పోలీసులు అవమానించారనే విమర్శలు వస్తున్నాయి. వీరేశం రెండవసారి ఎమ్మల్యేగా గెలిచారు. అయినా అతన్ని పోలీసులు గుర్తు పట్టకపోవడం ఏంటనే చర్చ వస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్యలను సాదరంగా లోపలికి తీసుకెళ్లిన పోలీసులు.. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వేముల వీరేశాన్ని ఎందుకు ఆపేశారన్నది ప్రశ్నగా మారింది. రెడ్డి మంత్రుల సమావేశంలో దళిత ఎమ్మెల్యేలను కావాలనే అవమానించారని దళిత వర్గాలు మండిపడుతున్నాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో సెగలు రేపుతోంది.