రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన ఆస్తి, పంట నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధిత ప్రజలకు, రైతులకు పరిహారం ప్రకటించారు. సచివాలయంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన పరిహారం వివరాలు వెల్లడించారు. విజయవాడ నగరంలో 32 వార్డులు 179 సచివాలయ పరిధిలో వరద ప్రభావం తీవ్రంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. గ్రౌండ్ ఫ్లోర్ లో మునిగిన ఇళ్లకు 25 వేల రూపాయల ప్యాకేజీ ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించారు. మొదటి అంతస్తులో ఉన్న వారికి 10 వేల రూపాయల ప్యాకేజీ ఆర్థిక సాయం ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
హెక్టార్ వరికి రూ.25 వేలు, ఎకరాకు రూ.10 వేలు సాయం. హెక్టార్ పత్తికి రూ.25 వేలు, వేరుశనగకు రూ.25 వేలు సాయం. హెక్టార్ చెరకు రూ.25 వేలు, హెక్టార్ పొగాకుకు రూ.15 వేలు. హెక్టార్ మొక్కజొన్న, రాగికి రూ.15 వేలు ఆర్థికసాయం. హెక్టార్ సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకుకు రూ.15 వేలు. జనపనార, కొర్రలు, సామలకు రూ.15 వేలు సాయం. పసుపు, అరటికి రూ.35 వేల చొప్పున ఆర్థికసాయం. కూరగాయలకు రూ.25 వేలు, మిరపకు రూ.35 వేలు సాయం. బొప్పాయికి రూ.25 వేలు, టమాటకు రూ.25 వేలు సాయం. జామకు రూ.35 వేలు, పూలకు రూ.25 వేలు సాయం. ఉల్లిపాయ రూ.25 వేలు, నిమ్మకు రూ.35 వేలు సాయం. మామిడికి రూ.35 వేలు, కాఫీకి రూ.35 వేలు సాయం. పుచ్చకాయకు రూ.25 వేలు, నర్సరీకి రూ.25 వేలు సాయం. దానిమ్మకు రూ.35 వేలు, సపోటకు రూ.35 వేలు సాయం. డ్రాగన్ ఫూట్‌కు రూ.35 వేలు, పామాయిల్ చెట్టుకు రూ.1500 సాయం. సెరీకల్చర్‌కు రూ.25 వేలు, కొబ్బరి చెట్టుకు రూ.1500 సాయం ప్రకటించింది ప్రభుత్వం.
వరదల వల్ల రాష్ట్రం అతలాకుతలం అయిందన్నారు సీఎం చంద్రబాబు.కృష్ణానదిలో అత్యంత నీళ్లు రావడం మొదటిసారని చెప్పారు.గత పాలకుల నిర్లక్ష్యం.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే.. బుడమేరు పొంగిందని తెలిపారు. మూడు బోట్లు ఒకే కలర్ లో ఉన్నాయంటే ఏం జరిగిందో మీరే అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు కామెంట్ చేశారు.