
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- వైయస్ షర్మిల తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమ అందాలకు తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు ఎంతటి వివాదాన్ని సృష్టించాయి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణ మంత్రులు ఒక్కొక్కరుగా వార్నింగ్ ఇస్తూనే పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక తాజాగా షర్మిల మాట్లాడుతూ కోనసీమకు తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది అనడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి అని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దు అని అన్నారు. మూఢనమ్మకాలతో ప్రజలను కించపరచడం, ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి అంటూ రుద్దడం తప్పు అని సూచించారు. కోనసీమకు తెలంగాణ ప్రజల దిష్టి పట్టలేదు అంటూనే సముద్రం నుంచి పైకి వస్తున్న ఉప్పు నీళ్లతో కొబ్బరి చెట్లు కూలిపోయాయి అని.. మీకు నిజంగా చిత్తశుద్ధి అనేదే ఉంటే ఉప్పునీటి ముక్కును తప్పించండి అని వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు.
Read also : హిందూ దేవుళ్ళను అవమానించిన సీఎం.. కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే?
Read also : భారీ స్కోరు నమోదు చేసిన టీమిండియా.. ఇద్దరు ప్లేయర్లు సెంచరీలు!





